Nara Lokesh: ఈ విషయం బయటకి రాకుండా చేస్తున్నారు.. ఈ శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి: లోకేశ్
- జగన్ గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడింది
- రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు
- ప్రభుత్వంలో చలనం లేదు
- పులివెందుల నియోజకవర్గంలో ఓ దళిత మహిళపై హత్యాచారం
ఆంధ్రప్రదేశ్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ‘వైఎస్ జగన్ గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. చట్టాల పేరు చెబుతూ కాలయాపన తప్ప మృగాళ్లను శిక్షించింది లేదు’ అని నారా లోకేశ్ చెప్పారు.
‘మహిళలపై రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పులివెందుల నియోజకవర్గంలో ఓ దళిత మహిళ హత్యాచారానికి గురైంది. ఈ విషయం బయటకి రాకుండా చెయ్యడానికి ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి అత్యంత కిరాతకంగా నాగమ్మని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.