Lakshman: టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు: లక్ష్మణ్

TRS govt can not survive for long time says Lakshman
  • టీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది
  • జీహెచ్ఎంసీ పాలకమండలి ఏర్పాటుకు ఫిబ్రవరి వరకు గడువుందంటున్నారు
  • అలాంటప్పుడు ముందస్తు ఎన్నికలు ఎందుకు పెట్టారు?
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రోజులు మనుగడ సాగించలేదని బీజేపీ నేత లక్ష్మణ్ జోస్యం చెప్పారు. వరుస ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రతికూల ఫలితాలను సాధిస్తుండటంతో... టీఆర్ఎస్ నేతల్లో కూడా అంతర్మథనం ప్రారంభమైందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయినా కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయడం లేదని, ఫిబ్రవరి వరకు గడువుందని చెపుతున్నారని మండిపడ్డారు.

ఫిబ్రవరి వరకు గడువు ఉన్నప్పుడు ముందస్తుగా ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తొత్తుగా వ్యవహరించకుండా పాలక మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అప్పులమయం అయిందని... పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఉద్యోగుల తరపున బీజేపీ పోరాడుతుందని చెప్పారు.
Lakshman
BJP
TRS
GHMC Elections

More Telugu News