Buggana Rajendranath: చంద్రబాబు వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతున్నాం: బుగ్గన

Sorting out every issue made by Chandrababu says Buggana
  • టీడీపీ ప్రభుత్వం ఎన్నో తప్పులను చేసింది
  • పోలవరం సమస్యలను కేంద్ర మంత్రికి చెప్పాం
  • పోలవరంపై అవగాహన ఉందని షెకావత్ చెప్పారు
గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందని... చంద్రబాబు వేసిన ఆ చిక్కుముడులను తాము ఒక్కొక్కటిగా విప్పుతున్నామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల గురించి కేంద్ర మంత్రులను కలుస్తున్నామని చెప్పారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను ఈరోజు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బుగ్గన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

2017లో జరిగిన పొరపాట్ల వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బందులు వచ్చాయనే విషయాన్ని షెకావత్ దృష్టికి తాము తీసుకెళ్లామని బుగ్గన తెలిపారు. సవరించిన అంచనాలను ఆమోదించాలని మెమొరాండం ఇచ్చామని చెప్పారు. పోలవరంపై తనకు అవగాహన ఉందని, ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేలా చూస్తానని చెప్పారని అన్నారు. తాము చెప్పిన అన్ని విషయాలను కేంద్ర మంత్రి విన్నారని, సానూకూలంగా స్పందించారని చెప్పారు.
Buggana Rajendranath
Gajendra Singh Shekhawat
YSRCP
Polavaram Project
Chandrababu
Telugudesam

More Telugu News