Eluru Incident: ఏలూరులో కేసులు తగ్గుముఖం పట్టాయి... ఉపరాష్ట్రపతికి ఆరోగ్య శాఖ నివేదిక
- ఏలూరులో వందల సంఖ్యలో ప్రజలకు తీవ్ర అస్వస్థత
- ఆసుపత్రులకు బారులు తీరిన జనాలు
- అంతుబట్టని లక్షణాలతో సతమతం
- ఇప్పుడా తీవ్రత లేదన్న ఆరోగ్యశాఖ కార్యదర్శి
- ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయని వెల్లడి
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గత కొన్నిరోజులుగా ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. జాతీయ స్థాయి వైద్య సంస్థలన్నీ ఏలూరుపైనే దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఏలూరు వ్యవహారంపై నివేదిక సమర్పించారు.
ఏలూరులో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వెల్లడించారు. ఏలూరులో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య బృందాలు పర్యటించాయని తెలిపారు. పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తున్న సూచనలు ఉన్నాయని వివరించారు.
కాగా, ఏలూరులో ఇప్పటివరకు 612 కేసులు నమోదయ్యాయి. 569 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలుస్తోంది.
.