terrorists: భారత్‌ను టార్గెట్ చేసిన మలేసియా ఉగ్రవాదులు.. భగ్నం చేసిన ‘రా’
- మలేసియా కేంద్రంగా భారీ కుట్ర
- మయన్మార్ మహిళకు ఉగ్రవాదుల శిక్షణ
- రాష్ట్రాలను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు
భారత్‌లో ఉగ్రదాడులకు మలేసియా కేంద్రంగా జరుగుతున్న భారీ కుట్రను భారత ఇంటెలిజెన్స్ సంస్థ (రా) భగ్నం చేసింది. భారత్‌లో ఉగ్రకార్యకలాపాల కోసం మలేసియాకు చెందిన ఓ ఉగ్ర సంస్థ 2 లక్షల డాలర్ల లావాదేవీలు జరిపినట్టు రా గుర్తించింది. ఈ లావాదేవీల్లో భాగంగా కొంత మొత్తాన్ని చెన్నైకి చెందిన ఓ హవాలా డీలర్ అందుకున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కౌలాలంపూర్‌కు చెందిన రోహింగ్యా నేత మొహమ్మద్ నసీర్, వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్ ఈ లావాదేవీల వెనక ఉన్నట్టు రా గుర్తించింది.
మయన్మార్‌కు చెందిన ఓ మహిళకు మలేసియా ఉగ్రవాద సంస్థలు శిక్షణ ఇచ్చాయి. భారత్‌లో దాడులు నిర్వహించే గ్రూపునకు ఈమె నాయకత్వం వహిస్తోంది. నేపాల్, లేదంటే బంగ్లాదేశ్ సరిహద్దు గుండా భారత్‌లో ప్రవేశించాలనేది ఉగ్రవాదుల ప్రణాళికగా రా పేర్కొంది. ఢిల్లీ, అయోధ్య, బోధ్ గయ, పశ్చిమ బెంగాల్‌లోని ముఖ్యనగరాలు, శ్రీనగర్‌లు ఉగ్రవాదుల లక్ష్యంగా గుర్తించిన నిఘా వర్గాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి.