Kasu Mahesh Reddy: నడికుడిలో అంతుచిక్కని వ్యాధి కేవలం సోషల్ మీడియా సృష్టి: ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి

MLA Kasu Mahesh Reddy clarifies over Nadikudi issue
  • సంచలనం సృష్టించిన ఏలూరు వింతవ్యాధి
  • నడికుడిలోనూ జనాలు పడిపోతున్నారంటూ ప్రచారం
  • ఈ ప్రచారంలో నిజంలేదన్న ఎమ్మెల్యే
  • బాధితుడు అనారోగ్యంతో పడిపోయాడని వెల్లడి
  • రసాయన పరిశ్రమపై కమిటీ వేస్తామని హామీ
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడదే రీతిలో గుంటూరు జిల్లాలోనూ అస్వస్థతకు గురవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి స్పందించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో వింతజబ్బు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు.

ఇది కేవలం సోషల్ మీడియా సృష్టేనని అన్నారు. పల్లపు రామకృష్ణ అనే వ్యక్తి అనారోగ్యం కారణంగానే అస్వస్థతకు లోనయ్యాడని వివరించారు. ప్రజలు ఆందోళనకు గురికావాల్సిందేమీలేదని తెలిపారు. కాగా, స్థానికంగా కాలుష్యానికి కారణమవుతోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రసాయన పరిశ్రమపై కమిటీ వేస్తామని, నివేదికను బట్టి చర్యలు ఉంటాయని వివరించారు.
Kasu Mahesh Reddy
Nadikudi
Dachepalli
Guntur District
YSRCP
Eluru

More Telugu News