Rajnath Singh: కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కంగన రనౌత్ భేటీ!

Kangana Meeting with Rajnath Singh
  • ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో కొత్త చిత్రం
  • 'తేజస్'లో పైలెట్ గా నటిస్తున్న కంగన
  • సినిమాకు అనుమతుల కోసం వెళ్లిన కథానాయిక 
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆయన నివాసంలో కలిశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో 'తేజస్' పేరిట రూపొందుతున్న సినిమాలో కంగన పైలెట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన చెల్లెలు రంగోలీ, చిత్ర యూనిట్ తో కలిసి రాజ్ నాథ్ వద్దకు వెళ్లిన కంగన, పరిశీలన కోసం సినిమా స్క్రిప్ట్ కాపీని ఆయనకు అందజేశారు. సినిమా షూటింగుకు అవసరమైన కొన్ని అనుమతులను మంజూరు చేయాలని కోరారు. కంగన కోరికపై రాజ్ నాథ్ సానుకూలంగా స్పందించారు.
Rajnath Singh
Kangana Ranaut
Tejas
Movie

More Telugu News