Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • 154 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 44 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతం వరకు పెరిగిన ఓఎన్జీసీ షేర్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. కరోనా వైరస్ వల్ల నష్టపోయిన ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతోందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఆశాజనకంగా ట్రేడింగ్ జరిపారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 154 పాయింట్లు లాభపడి 46,253కి పెరిగింది. నిఫ్టీ 44 పాయింట్లు పుంజుకుని 13,558కి చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (4.91%), ఎల్ అండ్ టీ (4.61%), ఎన్టీపీసీ (2.15%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.07%), టైటాన్ కంపెనీ (1.27%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.98%), బజాజ్ ఆటో (-1.17%), టెక్ మహీంద్రా (-1.14%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.06%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.90%).

  • Loading...

More Telugu News