Adimulapu Suresh: జనవరి 9న అమ్మఒడి నగదు జమ చేస్తాం: ఆదిమూలపు సురేశ్
- ఈ నెల 20 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు
- 26న లబ్ధిదారుల తుది జాబితా విడుదల చేస్తాం
- ఉపాధ్యాయుల బదిలీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోంది
వచ్చే నెల 9న జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఈ నెల 20 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. 20వ తేదీ నుంచి 24 మధ్య జాబితాలో తప్పుల సవరణకు అవకాశమిస్తామని... 26న లబ్ధిదారుల తుది జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు.
గత ఏడాది 43.54 లక్షల లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేశామని... రూ. 6,336 కోట్లను పంపిణీ చేశామని ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. బదిలీలను నాలుగు కేటగిరీలుగా విభజించి చేపడుతున్నామని చెప్పారు. కొన్ని స్కూళ్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకే బదిలీ ప్రక్రియను చేపట్టామని తెలిపారు.