Britain: బ్రిటన్‌లో కొత్తరకం కరోనా.. పరిశీలిస్తున్నామన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

New corona virus found in Britain

  • వెయ్యి మందిలో కొత్తరకం వైరస్ గుర్తింపు
  • రోజులు గడిచే కొద్దీ పరివర్తన చెందుతున్న వైరస్
  • లోతైన అధ్యయనం అవసరమన్నడబ్ల్యూహెచ్ఓ

బ్రిటన్‌లో కొత్తగా వెయ్యి మందికి సోకిన కొత్తరకం కరోనా వైరస్‌పై తమకు అవగాహన ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ప్రస్తుత వైరస్‌కు భిన్నంగా ఇది వ్యవహరిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని పేర్కొంది. రోజులు గడిచే కొద్దీ కరోనా వైరస్ మ్యుటేషన్ చెందుతోందని, ఇప్పటికే అనేక రకాల వైరస్‌లను గుర్తించామని డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారి మైఖేల్ ర్యాన్ పేర్కొన్నారు.

మరోవైపు, బ్రిటన్‌లో శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులకు ఈ కొత్తరకమే కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో దీని వ్యాప్తిని అరికట్టేందుకు లండన్‌లో మూడో విడత ఆంక్షలు విధిస్తున్నట్టు ఆరోగ్యమంత్రి మ్యాట్ హాంకాక్ తెలిపారు. కాగా, ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనా టీకా పంపిణీ గతవారమే బ్రిటన్‌లో ప్రారంభమైంది. తొలి విడతగా హెల్త్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వృద్ధులకు ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News