Komatireddy Venkat Reddy: పాత పద్ధతి ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయాలి: కోమటిరెడ్డి
- మూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి
- ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
- కేసీఆర్ తన పద్ధతిని మార్చుకోవాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్లను ఆపేసి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కొత్త విధానంతో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయని విమర్శించారు. పాత విధానం ప్రకారమే ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని అన్నారు.
ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. ఎల్ఆర్ఎస్ ను పక్కన పెట్టకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. కేసీఆర్ తీరు పిచ్చి తుగ్లక్ చర్యలను తలపిస్తోందని దుయ్యబట్టారు. ఇకనైనా కేసీఆర్ తన పద్ధతిని మార్చుకోవాలని... లేనిపక్షంలో ప్రగతిభవన్ గడీలను బద్దలు కొడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించాలని హితవు పలికారు.