Smugglers: సరిహద్దుల్లో హైటెక్ స్మగ్లింగ్.. ఇద్దరి అరెస్ట్
- పాక్ నుంచి భారత్ లోకి డ్రగ్స్, ఆయుధాలు
- అక్రమ రవాణాకు డ్రోన్లను వినియోగిస్తున్న స్మగ్లర్లు
- పక్కా సమాచారంతో పోలీసుల దాడులు
- డ్రగ్స్, డ్రోన్, తుపాకీ స్వాధీనం
- నిందితులకు పాక్ స్మగ్లర్లతో సంబంధాలు
పాకిస్థాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేసేందుకు స్మగ్లర్లు హైటెక్ బాటను ఎంచుకున్నారు. డ్రోన్ల సాయంతో సరిహద్దుల ఆవల నుంచి అక్రమ రవాణా చేపడుతున్నారు. ఈ అక్రమదందాపై పక్కా సమాచారంతో పంజాబ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరికి పాకిస్థాన్ స్మగ్లర్లతో సన్నిహిత సంబంధాలున్నట్టు భావిస్తున్నారు. అరెస్టయిన వారిని లఖ్బీర్ సింగ్, బచిత్తర్ సింగ్ లుగా గుర్తించారు. ఈ దాడుల్లో పాలుపంచుకున్న అమృత్ సర్ పోలీసులు మాదకద్రవ్యాలు, ఒక క్వాడ్ కాప్టర్ డ్రోన్, సపోర్టర్ స్టాండ్, స్కైడ్రాయిడ్ ట్రాన్స్ మిటర్, కెమెరా సహిత మినీ రిసీవర్, పాయింట్ 32 బోర్ రివాల్వర్, కొన్ని కార్ట్రిడ్జ్ లు, ఓ స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు.