Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్ లో భారీ వ్యతిరేకత!
- ప్రభుత్వం గాడి తప్పిందన్న 77 శాతం మంది
- ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్న 36 శాతం మంది
- అన్ని రాష్ట్రాల పరిస్థితి దారుణంగానే ఉందన్న సర్వే
ఒక అద్భుతమైన క్రికెటర్ గా పాకిస్థాన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఇమ్రాన్ ఖాన్... ఆ దేశ ప్రధానిగా మాత్రం ప్రజాభిమానాన్ని కూడగట్టుకోలేకపోతున్నారు. ఇమ్రాన్ ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పిపోయిందని ఆ దేశంలోని 77 శాతం మంది ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి ఐదుగురిలో నలుగురు పాక్ ప్రభుత్వం పట్ల వ్యతరేక భావంతో ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది.
ఐపీఎస్ఓఎస్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. డిసెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించిన ఈ సర్వేలో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని 36 శాతం మంది చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగానే ఉందని సర్వేలో తేలింది. నిరుద్యోగం పెను సమస్యగా పరిణమించిందని సర్వే తెలిపింది.