Raja Singh: కాళీమాత ఆలయ భూములను ఆక్రమించారు: రాజాసింగ్
- అధికారుల నిర్లక్ష్యంతో భూములు ఆక్రమించారు
- భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
- ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
హైదరాబాద్ పాతబస్తీలోని ఉప్పుగూడలో ఉన్న కాళీమాత ఆలయ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆలయ భూములను ఆక్రమించారని ఆరోపించారు. దేవాలయం భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని... ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఉప్పుగూడలోని సర్వే నంబర్ 24, 25, 26లలో ఏడు ఎకరాల 13 గుంటల భూమిపై పెద్ద గొడవే జరుగుతోంది. ఆలయ ట్రస్ట్ తనకు భూమి అమ్మిందని చెపుతూ పోలీసుల సాయంతో ఓ వ్యక్తి నిర్మాణాలు చేపట్టారు. ప్రహరీ గోడను కట్టి, నిర్మాణాలను ప్రారంభించారు. ఈ నిర్మాణాలను బీజేపీ నేతలు, స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు ఈ విషయాన్ని రాజాసింగ్ దృష్టికి తీసుకెళ్లడంతో... వారికి మద్దతుగా రాజాసింగ్ ఆలయం వద్దకు వచ్చారు.