Corona Virus: దేశంలో కోటి దాటిన కరోనా కేసులు

COVID19 cases tally crosses the 1 crore mark with

  • 24 గంటల్లో 25,153 మందికి కరోనా 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,04,599
  • మృతుల సంఖ్య 1,45,136
  • కోలుకున్న వారు 95,50,712 మంది  

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మొత్తం కోటి దాటింది. దేశంలో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 25,153 మందికి కరోనా నిర్ధారణ అయింది.  దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,04,599కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 347 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,45,136 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 95,50,712 మంది కోలుకున్నారు. 3,08,751 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 16,00,90,514 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,71,868 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News