Raj Nath Singh: జల, వాయు, భూమిపైనే కాదు సైబర్ రూపంలోనూ‌ యుద్ధం పొంచి ఉంది: హైదరాబాద్‌లో రాజ్‌నాథ్‌

great hac attack danger also there says rajnath

  • ఎదుర్కొనేందుకు మరింత సన్నద్ధం కావాలి
  • వాయు సేన అందిస్తున్న సేవలు అభినందనీయం
  • దుండిగల్ అకాడమీ ఎంతోమంది వీరులను దేశానికి అందించింది
  • దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వాయుసేన సిద్ధంగా ఉండాలి

ప్రస్తుత కాలంలో జల, వాయు, భూమిపైనే జరిగే యుద్ధాలే కాకుండా సైబర్‌ యుద్ధం కూడా పొంచి ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. వాటిని ఎదుర్కొనేందుకు మరింత సన్నద్ధం కావాలని అన్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు పాసింగ్ అవుట్ పెరేడ్ జరగగా, శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇందులో హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌  ఆర్‌కేఎస్‌ బదౌరియా కూడా పాల్గొన్నారు.

ఇందులో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... దేశానికి వాయు సేన అందిస్తున్న సేవలు అభినందనీయమని చెప్పారు. దుండిగల్ అకాడమీ ఎంతోమంది వీరులను దేశానికి అందించిందని చెప్పారు.  దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వాయుసేన సిద్ధంగా ఉండాలని చెప్పారు.

స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నామని తెలిపారు.  రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ వాయుసేన అమ్ముల పొదిలో చేరడంతో వాయుసేనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని తెలిపారు. భారత్‌ శాంతినే కోరుకుంటోందని, అయితే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు కూడా రక్షణ దళాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. బాలకోట్ లో ఉగ్రవాదుల దాడి ఘటన అందరికీ తెలిసిందేనని చెప్పారు.

  • Loading...

More Telugu News