TTD: తిరుపతిలో నిరసనకు దిగిన భక్తులు

devotees protest at ttd

  • సర్వదర్శనం టోకెన్ల జారీ విషయంలో అభ్యంతరాలు 
  • విష్ణు నివాసం ఎదుట శ్రీవారి భక్తుల నిరసన
  • 24వ తేదీ దర్శనం కోసం టోకెన్లను ఇచ్చిన సిబ్బంది
  • నాలుగు రోజుల పాటు తాము ఎక్కడ ఉండాలని భక్తుల ప్రశ్న

సర్వదర్శనం టోకెన్ల జారీ విషయంలో అభ్యంతరాలు తెలుపుతూ తిరుపతిలోని విష్ణు నివాసం ఎదుట శ్రీవారి భక్తులు నిరసనకు దిగారు. ఈ నెల 24వ తేదీ దర్శనం కోసం టోకెన్లను ఇప్పుడు ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

సర్వదర్శనం కోసం ఈ  నాలుగు రోజుల పాటు తాము ఎక్కడ ఉండాలని వారు నిలదీస్తున్నారు. వారు వ్యక్తం చేస్తోన్న అభ్యంతరాల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పందిస్తూ.. రోజువారీ టిక్కెట్ల జారీ పరిమితి దాటిందని చెప్పారు. అందుకే తాము 24వ తేదీ సర్వదర్శనం కోసం టోకెన్లను ముందస్తుగా ఇస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే తాము ఈ నెల 21, 22, 23 తేదీల సర్వ దర్శనాల టోకెన్లను జారీ చేసినట్లు చెప్పారు. తిరుమలకు వచ్చిన భక్తులను వెనక్కి పంపకూడదని తాము భావిస్తున్నామని, అందుకే టోకెన్లను ముందస్తుగానే జారీ చేస్తున్నామని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News