Corona Virus: వచ్చే నెల నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్

India may get corona vaccination from january

  • భద్రత, టీకా సామర్థ్యం విషయంలో రాజీపడబోం
  • టీకా తయారీ, పరిశోధన విషయాల్లో ఇతర దేశాలకు తీసిపోం
  • దేశంలో అభివృద్ధి దశలో 9 టీకాలు

కరోనా వైరస్ టీకా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్న వేళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దేశంలో టీకా అత్యవసర వినియోగానికి పలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని, సంబంధిత విభాగాలు వాటిని జాగ్రత్తగా సమీక్షిస్తున్నట్టు చెప్పారు.

 భద్రత, టీకా సామర్థ్యానికే తాము పెద్దపీట వేస్తామని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. టీకా పరిశోధన, తయారీల్లో మిగతా దేశాలకు భారత్ ఏమాత్రం తీసిపోదన్నారు. కాగా, వచ్చే ఆరేడు నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్టు హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో మొత్తం 9 కరోనా టీకాలు అభివృద్ధి దశలో ఉండగా, వీటిలో ఆరు క్లినికల్ ట్రయల్స్‌లో, మూడు ప్రీక్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News