Jamili Elections: జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం: చీఫ్ ఎలక్షన్ కమిషనర్

We are ready to conduct Jamili elections says CEC

  • 'ఒకే దేశం... ఒకే ఎలక్షన్' నినాదంతో జమిలి ఎన్నికలు
  • జమిలి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో మోదీ
  • పార్లమెంటు సవరణల తర్వాత ఎన్నికలకు సిద్ధమన్న సునీల్ అరోరా  

'ఒకే దేశం... ఒకే ఎలక్షన్' నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే వేల కోట్ల రూపాయల ప్రజాధనం మిగులుతుందని మోదీ చెపుతున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

మరోవైపు దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఎన్నికల నిర్వహణపై పార్లమెంటు సవరణలు చేసిన తర్వాత జమిలి పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

భారత్ కు జమిలి ఎన్నికలు ఎంతో అవసరమని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సునీల్ అరోరా జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమని ప్రకటించారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని... దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని అన్నారు. ఎప్పుడూ ఎన్నికలు జరుగుతుండటం దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని చెప్పారు. ఈ సమస్యపై లోతైన అధ్యయనంతో పాటు, చర్చలు జరపాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News