India: కలవరపెడుతున్న కరోనా కొత్త రకం .... బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను ఈ నెల 31 వరకు రద్దు చేసిన కేంద్రం

India bans flights from Britain till month ending

  • బ్రిటన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభణ
  • అప్రమత్తమైన యూరప్ దేశాలు
  • బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసిన బెల్జియం, నెదర్లాండ్స్ 
  • తాత్కాలికంగా రద్దు చేశామన్న కేంద్ర విమానయాన శాఖ

కరోనా వైరస్ కు చెందిన ఓ కొత్తరకం బ్రిటన్ లో విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు యూరప్ దేశాలు కీలక చర్యలు తీసుకోగా, ఇప్పుడా దేశాల బాటలోనే భారత్ కూడా నడుస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

విమానాల రద్దు నిర్ణయం రేపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. బ్రిటన్ నుంచి వచ్చే అన్ని రకాల విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది. బ్రిటన్ లో కరోనా వైరస్ కొత్త రకం స్ట్రెయిన్ అత్యంత ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

బ్రిటన్ లో కొత్తరకం స్ట్రెయిన్ పై అక్కడి ఆరోగ్యమంత్రి మాట్ హేంకాక్ స్పందిస్తూ, పరిస్థితి చేయిదాటిపోయిందని ప్రకటించడంతో ఇతర యూరప్ దేశాలు అప్రమత్తం అయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను బెల్జియం, నెదర్లాండ్స్ వంటి దేశాలు నిషేధించాయి.

  • Loading...

More Telugu News