Vehicle: జనవరి 1 నుంచి మోత మోగనున్న వాహనాల ధరలు!

Vehicle price hike in India

  • నిర్మాణ వ్యయం పెరగడంతో ధరల పెంపు బాటపడుతున్న సంస్థలు
  • ఉక్కు, ప్లాస్టిక్ ధరల పెంపు
  • ఇప్పటికే వాహన ధరల పెంపు ప్రకటన చేసిన మారుతి, హీరో, మహీంద్రా
  • అదే బాటలో టాటా, బీఎండబ్ల్యూ, ఇసుజు

ఉక్కు, ప్లాస్టిక్, ఇతర నిర్మాణ వ్యయాలు పెరగడంతో భారత్ లోని వాహన సంస్థలు ధరల పెంపు బాట పట్టాయి. ఇప్పటికే మహీంద్రా, రెనో, హీరో మోటోకార్ప్, మారుతిసుజుకి, ఫోర్డ్ వంటి వాహన తయారీ సంస్థలు జనవరి 1 నుంచి తమ వాహన మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇప్పుడు బీఎండబ్ల్యూ, టాటా మోటార్స్, ఇసుజు సంస్థలు కూడా వాణిజ్యపరమైన వాహనాల ధరలు పెంచాలని నిర్ణయించుకున్నాయి.

ఉత్పత్తి వ్యయం అధికం కావడమే కాకుండా, బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు తయారు చేయాల్సిరావడం ఆర్థికంగా ప్రయాసభరితమని టాటా మోటార్స్ వెల్లడించింది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ జనవరి 4 నుంచి ధరలు పెంచేందుకు సిద్ధమైంది. బీఎండబ్ల్యూతో పాటు అనుబంధ బ్రాండ్లపై 2 శాతం పెంపు ఉంటుందని తెలిపింది. పికప్ వాహనాలకు పెట్టింది పేరైన ఇసుజు సంస్థ మోడళ్లను బట్టి రూ.10 వేల మేర ధరల పెంచాలని నిర్ణయించింది. ఇసుజు ధరల పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

  • Loading...

More Telugu News