Devineni Uma: ఈ నెల 25న విజయసాయిరెడ్డి పంపిణీ చేస్తానన్న వ్యాక్సిన్ దీనికేనా?: దేవినేని ఉమ
- ఏపీలో కొత్తరకం కరోనా
- కేవలం ప్రతిపక్షాలు, ప్రజలు నిరసన తెలిపితే ప్రభుత్వం అడ్డుకుంటుంది
- స్థానిక ఎన్నికలకు అడ్డంకిగా ఉంటుంది
- వైసీపీ సభలు, పుట్టినరోజు వేడుకలకి అడ్డంకికాదు
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సభలు, పాదయాత్రలు, పుట్టినరోజు వేడుకలకి అడ్డంకి కాని కరోనా వైరస్ స్థానిక ఎన్నికలకు అడ్డంకిగా ఉందా? అంటూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. తాజాగా, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని నెలల ముందు చెప్పిన మాటలను కూడా ఆయన ఇందులో వినిపించారు.
‘ఏపీలో కొత్తరకం కరోనా. కేవలం ప్రతిపక్షాలు, ప్రజలు నిరసన తెలిపితే ప్రభుత్వం అడ్డుకుంటుంది, కేసులు పెడుతుంది. స్థానిక ఎన్నికలకు అడ్డంకిగా ఉంటుంది. వైసీపీ సభలు, పాదయాత్రలు, పుట్టినరోజు వేడుకలకి అడ్డంకికాదు. వారికి ఈ వైరస్ సోకదు. 25న ఎంపీ విజయసాయిరెడ్డి పంపిణీ చేస్తానన్న వాక్సిన్ దీనికేనా?’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.