indrani: ఖైదీలకు ఇచ్చే పచ్చచీర నాకు వద్దు: ఇంద్రాణి ముఖర్జీ

i dont want inmates saree indrani

  • ఎనిమిదేళ్ల క్రితం జరిగిన షీనాబోరా హత్య 
  • ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ
  • ప్రస్తుతం జైలులో ఉంటోన్న ఇంద్రాణి 
  • యూనిఫాం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని అర్జీ

ఎనిమిదేళ్ల క్రితం జరిగిన షీనాబోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలులో ఉంటోన్న విషయం తెలిసిందే. అయితే, ఖైదీలకు ఇచ్చే పచ్చరంగు చీరను తాను కట్టుకోనంటూ ఆమె సీబీఐ కోర్టుకి అర్జీ పెట్టుకుంది. ఆ యూనిఫాం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆమె కోరింది.

తనపై ఉన్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటికీ విచారణ కొనసాగుతోందని ఆమె గుర్తు చేసింది. తాను దోషిగా తేలలేదని, అయినప్పటికీ, ఖైదీలు ధరించే యూనిఫాంను తనకు ఇస్తామని జైలు అధికారులు చెబుతున్నారని ఆమె పేర్కొంది. దీనిపై స్పందించిన సీబీఐ కోర్టు ఆమె అర్జీపై వెంటనే సమాధానం చెప్పాలని జైలు అధికారులకు సూచించింది. కాగా, షీనాబోరా హత్యకేసులో ఇంద్రాణి డ్రైవర్ అప్రూవర్‌గా మారి పలు విషయాలు బయటపెట్టడంతో పోలీసులు గతంలో ఇంద్రాణిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News