Narendra Modi: దేశంలో మొట్టమొదటి డ్రైవర్ రహిత మెట్రో రైలును ప్రారంభించిన మోదీ

Modi inaugurates Indias first driverless train on Delhi Metros Magenta Line

  • ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలు
  • పశ్చిమ జనక్‌పురి-బొటానికల్ గార్డెన్ మధ్య సర్వీసు
  • దేశంలో అటల్ జీ హయాంలోనే మొట్టమొదటి మెట్రో అన్న మోదీ
  • 2014లో 5 నగరాల్లోనే మెట్రో సేవలు
  • ఇప్పుడు 18 నగరాల్లో మెట్రో సేవలని వ్యాఖ్య

ఢిల్లీలో డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ సేవలను ప్రారంభించారు. పశ్చిమ జనక్‌పురి-బొటానికల్ గార్డెన్ మధ్య 37 కిలోమీటర్ల పరిధిలో సేవలు అందనున్నాయి. ఇది దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు.

వచ్చే ఏడాది జూన్ నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్‌ లైన్‌లో కూడా ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఈ రోజు నేషనల్‌ మొబిలిటీ కార్డును కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... భారత్ స్మార్ట్ సిస్టమ్‌లో ఎంతగా ముందుకు వెళుతుందన్న విషయాన్ని డ్రైవర్ లెస్ మెట్రో సేవల ప్రారంభం స్పష్టం చేస్తోందని చెప్పారు.  

దేశంలో అటల్ జీ హయాంలోనే మొట్టమొదటి మెట్రో ప్రారంభమైంది. తిరిగి 2014లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేవలం 5 నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉండేవి. ఇప్పుడు 18 నగరాల్లో మెట్రో సేవలు అందుతున్నాయి. 2025లోపు దేశంలోని 25 నగరాల్లో మెట్రో సేవలు అందేలా చేస్తాం’ అని చెప్పారు.

  • Loading...

More Telugu News