Sensex: బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 259 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 59 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- ఐదున్నర శాతం వరకు పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఒకనొక సమయంలో మార్కెట్లు రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ మెటల్, మీడియా, ఎఫ్ఎంసీజీ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో లాభాలు హరించుకుపోయాయి. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు పుంజుకోవడంతో చివరకు మళ్లీ మంచి లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు లాభపడి 47,613కి పెరిగింది. నిఫ్టీ 59 పాయింట్లు పుంజుకుని 13,934 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.41%), యాక్సిస్ బ్యాంక్ (2.06%), టెక్ మహీంద్రా (1.95%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.92%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.68%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.74%), ఎన్టీపీసీ (-1.69%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.02%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ (-0.91%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.70%).