Gujarat: బీజేపీకి గుడ్‌బై చెప్పిన గుజరాత్ ఎంపీ మన్‌సుఖ్ భాయ్ వాసవ

Gujarat BJP MP Mansukh Vasava quits party

  • బరూచ్ నుంచి ఆరుసార్లు ఎన్నిక
  • 121 గ్రామాలను ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా ప్రకటించడంపై ప్రధానికి లేఖ
  • బడ్టెట్ సమావేశాల్లో ఎంపీ పదవికి రాజీనామా

గుజరాత్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనుసుఖ్ భాయ్ వాసవ మంగళవారం పార్టీని వీడారు. పార్లమెంటు బడ్జెట్ సెషన్‌లో ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు చెప్పారు. గిరిజన సమస్యలపై గొంతెత్తే ఆయన ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. నర్మద జిల్లాలోని 121 గ్రామాలను ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటిస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్‌ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఆ లేఖలో తీవ్రంగా వ్యతిరేకించారు. దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బరూచ్ నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు లేఖ రాస్తూ.. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నంత మాత్రాన పార్టీ ప్రతిష్ఠకు ఏమీ భంగం వాటిల్లబోదని, పార్టీకి తాను విశ్వాసమైన కార్యకర్తనని, తనను క్షమించాలని కోరారు. అయితే, ఆయన రాజీనామా వెనకున్న కారణాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News