TTD: భారీగా పెరిగిన తిరుమల భక్తులు... నిన్న 44 వేల మందికి దర్శనం!
- కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
- హుండీ ఆదాయం రూ.2.90 కోట్లు
- తలనీలాలు సమర్పించిన 9,363 మంది భక్తులు
తిరుమలలో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం నాడు 44,177 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, 9,363 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.90 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.
వైకుంఠ ఏకాదశి దర్శనాలు కొనసాగుతున్నాయని, అందువల్లే రద్దీ అధికంగా ఉందని వెల్లడించారు. భౌతిక దూరం పాటించేలా భక్తులకు జాగ్రత్తలను చెబుతున్నామని, ప్రతి ప్రాంతంలోనూ శానిటైజర్లను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. జనవరి 4 నుంచి సాధారణ దర్శనాలు మొదలవుతాయని అన్నారు.