FasTag: ఫాస్టాగ్ గడువును వచ్చే నెల 15 వరకు పొడిగించిన కేంద్రం
- గడువును మరో నెలన్నర రోజులు పెంచిన ప్రభుత్వం
- ఆ తర్వాతి నుంచి రెట్టింపు ఫీజు వసూలు
- ప్రస్తుతం 80 శాతం ఫాస్టాగ్ చెల్లింపులు
ఫాస్టాగ్ గడువును మరో నెలన్నర రోజులు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ గడువు నేటితో ముగియనుండగా దానిని ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు టోల్‌ప్లాజాల వద్ద హైబ్రిడ్ లేన్లలో ఫాస్టాగ్‌తోపాటు నగదు కూడా చెల్లించవచ్చని తెలిపింది.
టోల్‌ప్లాజాల వద్ద ప్రస్తుతం ఫాస్టాగ్‌ను ఉపయోగించి 75-80 శాతం చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా, వచ్చే నెల 15 తర్వాత టోల్‌ప్లాజాల వద్ద ఒక్క లైన్ మినహా మిగతా అన్నీ ఫాస్టాగ్‌లుగా మారనున్నాయి. గడువు తర్వాత కూడా ఫాస్టాగ్‌గా మారని వారి నుంచి రెట్టింపు ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.