Kim Jong Un: దేశ ప్రజలకు ఉత్తరాలు రాసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్
- నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తరాలు
- క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు తనపై నమ్మకాన్ని ఉంచారని వ్యాఖ్య
- ప్రజల ఆశలను నెరవేర్చడానికి కృషి చేస్తానన్న కిమ్
- 25 ఏళ్లలో నియంత ఇలా లేఖలు పంపడం ఇది తొలిసారి
నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ దేశ ప్రజలకు ఉత్తరాలు రాశారు. దేశంలో క్లిష్ట పరిస్థితులు వున్నప్పుడు తనపై నమ్మకాన్ని ఉంచినందుకు ప్రజలకు ఆయన థ్యాంక్స్ చెప్పారని ఆ దేశ మీడియా పేర్కొంది. హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుతూ దేశ ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు.
ఈ కొత్త సంవత్సరం ప్రజల ఆశలను నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలిపారు. ఉత్తరకొరియాలో 2.5 కోట్ల జనాభా ఉంటుంది. 25 ఏళ్లలో ఇలా లేఖలు పంపడం ఇది తొలిసారి. ప్రతి ఏడాది జనవరి 1న టీవీల ద్వారా తన సందేశాన్ని తమ దేశ ప్రజలకు అందించేవారు.
తన విధానాన్ని మార్చుకుని ఆయన ఈ సారి లేఖలు పంపడం గమనార్హం. తొమ్మిదేళ్ల క్రితం ఆయన ఉత్తరకొరియా అధ్యక్షుడి బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం ఆ దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. దీంతో ప్రజల నుంచి మద్దతు పొందే ప్రయత్నాలను ఆయన కొనసాగిస్తున్నారు.