BJP: ‘సామ్నా’లో ఆ రాతలేంటి?: విరుచుకుపడిన బీజేపీ

BJP writes letter to saamana editor over language on bjp leaders

  • మోదీ, బీజేపీ నాయకులపై వాడుతున్న భాష సరిగా లేదు
  • నాకు తెలిసి మీరు కూడా ఇలాంటి భాషను ఇష్టపడరు
  • అది మీకు సరైనదే అనిపిస్తే అలానే కొనసాగించవచ్చు

శివసేన అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీ నేతలపై వాడుతున్న భాషపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలంటూ బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ సామ్నా ఎడిటర్ రష్మి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. ఎడిటర్‌గా తమ పత్రికలో వస్తున్న భాష ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని, ఇలాంటి భాషను ఉపయోగించడంపై ఆలోచించాలని హితవు పలికారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ నేతలపై వాడుతున్న భాష సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా మీరు నాకు తెలుసని, మీరు కూడా ఇలాంటి భాషను ఇష్టపడరన్న విషయం తనకు తెలుసని రష్మిని ఉద్దేశించి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, తన అభ్యర్థన తప్పు అని కానీ, ‘సామ్నా’లో వాడుతున్న భాష సరైనది అని కానీ మీకు అనిపిస్తే నిరభ్యంతరంగా దానిని కొనసాగించవచ్చని చంద్రకాంత్ పాటిల్ ఆ లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News