JC Prabhakar Reddy: 300 మంది పోలీసులతో తాడిపత్రిలో భారీ బందోబస్తు
- నేటి నుంచి జేసీ ఆమరణ నిరాహార దీక్ష
- 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేస్తున్న పోలీసులు
- కేతిరెడ్డి, జేసీ నివాసాల ముందు నుంచి పోలీసుల భారీ కవాతు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనపై నమోదు చేసిన తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎత్తివేసేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అట్రాసిటీ చట్టాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన నేటి నుంచి ఆమరణ దీక్ష ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ర్యాలీలు, ధర్నాలకు పోలీసుల అనుమతి తప్పనిసరని డీఎస్పీ చైతన్య తెలిపారు. అలాగే, ముందు జాగ్రత్త చర్యగా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాల ముందు నుంచి భారీ కవాతు నిర్వహించారు.