Sensex: ఫుల్ జోష్ లో మార్కెట్లు.. తొలిసారి 48 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్
- 308 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 114 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 4 శాతానికి పైగా పుంజుకున్న ఓఎన్జీసీ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఫుల్ జోష్ లో ట్రేడ్ అయ్యాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో... రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, వారు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు రికార్ధు స్థాయిలో ముగిశాయి. సెన్సెక్స్ తొలిసారి 48 వేల మార్కును అధిగమించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 308 పాయింట్లు పెరిగి 48,177కి చేరుకుంది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 14,132కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (4.02%), టీసీఎస్ (3.71%), హెచ్చీఎల్ టెక్నాలజీస్ (3.05%), టెక్ మహీంద్రా (2.56%), ఇన్పోసిస్ (2.23%).
టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా (-1.43%), బజాజ్ ఫైనాన్స్ (-1.21%), ఏసియన్ పెయింట్స్ (-0.72%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.61%), టైటాన్ కంపెనీ (-0.49%).