Sonia Gandhi: టీపీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి... నేడు నిర్ణయం తీసుకోనున్న సోనియా గాంధీ!
- అనూహ్యంగా తెరపైకి వచ్చిన జీవన్ రెడ్డి పేరు
- రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు
- పలువురి పేర్లను పరిశీలించిన సోనియా
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది. సీనియర్ నేత, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, నేడు సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. కాగా, ఈ పదవికి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, మధుయాష్కి గౌడ్, డీ రాజనర్సింహ తదితరుల పేర్లనూ పరిశీలించిన సంగతి తెలిసిందే.