Tesla: డ్రైవర్ లేకుండా 576 కిలోమీటర్లు ప్రయాణించిన టెస్లా కారు!

Tesla Car Travels 576 KM in Self Driving Mode

  • మరో ఘనతను సొంతం చేసుకున్న టెస్లా
  • లాస్ ఏంజెల్స్ నుంచి శాన్ జోస్ వరకూ ప్రయాణం
  • సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ లో దూసుకెళ్లిన కారు

ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువను కలిగిన వాహన సంస్థగా చరిత్ర సృష్టించిన టెస్లా, ఇప్పుడు మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. టెస్లా కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ లో ప్రయాణిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ కారులో ఎంతదూరం స్టీరింగ్ ను ముట్టుకోకుండా ప్రయాణించవచ్చో చూడాలని భావించిన ఓ అమెరికన్ కారుకు పరీక్ష పెట్టాడు. సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ ను యాక్టివేట్ చేయగా, కారు 576 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

లాస్ ఏంజెల్స్ నుంచి శాన్ జోస్ వరకూ కారు దానంతట అదే వెళ్లిందని, స్టీరింగ్ ను కానీ, యాక్సిలేటర్, బ్రేక్ లను తాను ముట్టుకోను కూడా లేదని సదరు వ్యక్తి సోషల్ మీడియాలో వెల్లడించారు. కేవలం కారుకు చార్జింగ్ కోసం మార్గమధ్యంలో కాసేపు ఆపానని తెలిపారు.

కాగా, టెస్లా కార్లు మార్కెట్లోకి వచ్చిన తరువాత, సంస్థ ఈక్విటీ విలువ ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకగా, సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-2కు వెళ్లిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News