operation: కడుపునొప్పితో వచ్చిన మహిళ.. కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకలు తీసిన నిర్మల్ జిల్లా వైద్యులు
- నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘటన
- మహిళ మానసిక స్థితి సరిగా లేదన్న వైద్యులు
- ఆమెకు వెంట్రుకలు పీక్కొని తినే అలవాటు ఉందని వివరణ
- తీవ్ర కడుపునొప్పిరావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చిన బంధువులు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ మహిళకు అపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకలు బయటకు తీశారు. ఆ మహిళ కడుపునొప్పితో బాధపడుతుండడంతో పరీక్షలు చేసిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆ మహిళ మానసిక స్థితి సరిగా లేదని, ఆమెకు వెంట్రుకలు పీక్కొని తినే అలవాటు ఉందని వైద్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో కడుపులో వెంట్రుకలు ఉన్నాయని, ఈ మధ్య తరచూ కడుపు నొప్పి వస్తుండేదని చెప్పారు. ఇటీవల ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావంతో ఆమె బంధువులు ఆసుపత్రికి తీసుకురావడంతో పరీక్షలు నిర్వహించామని వివరించారు. ఆమె కడుపులో నుంచి రెండున్నర కిలోల వెంట్రుకలను తీసివేశామని, ఆపరేషన్ విజయవంతం అయిందని వివరించారు.