Sensex: రిలయన్స్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న బ్లూచిప్ కంపెనీలు
- 264 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 53 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
గత కొన్ని సెషన్లలో లాభాల్లో కొనసాగిన మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ వంటి బ్లూచిప్ కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 264 పాయింట్లు నష్టపోయి 48,174కి పడిపోయింది. నిఫ్టీ 53 పాయింట్లు కోల్పోయి 14,146 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.34%), భారతి ఎయిర్ టెల్(2.28%), ఓఎన్జీసీ (2.11%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.95%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.80%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-2.86%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.64%), బజాజ్ ఫైనాన్స్ (-1.82%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.36%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.34%).