Narendra Singh Tomar: వ్యవసాయ చట్టాల ముఖ్య ఉద్దేశాన్ని రైతులు అర్థంచేసుకోవాలి: తోమర్
- నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన కేంద్రం
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు
- చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్
- చర్చలు విఫలం
జాతీయ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు, రైతు సంఘాలు నవంబరు 26 నుంచి ఢిల్లీ సరిహద్దులో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికి పలు దఫాలుగా కేంద్రం, రైతుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు ఆ చట్టాలను ఎందుకు తీసుకువచ్చామన్నది అర్థం చేసుకోవాలని సూచించారు.
"భారత కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈ వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇస్తున్నవారినీ కలిశాం, వ్యతిరేకిస్తున్న వారినీ కలిశాం. ఇప్పుడీ చట్టాలను నిరసిస్తున్న వారు చట్టాలు చేయడానికి గల కారణాలను అవగాహన చేసుకుని వెంటనే చర్చలకు వచ్చి ఓ పరిష్కారం పొందుతారని భావిస్తున్నాం" అని తోమర్ తెలిపారు. మరోవైపు రైతులు, తమ ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 7న ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు.