Supreme Court: మ‌త మార్పిడి వ్య‌తిరేక చ‌ట్టాల ప‌రిశీల‌న‌కు సుప్రీంకోర్టు అంగీకారం

SC to examine state laws on religious conversion

  • పెళ్లి స‌మ‌యంలో మ‌త‌మార్పిడులు
  • యూపీలో చట్ట వ్యతిరేక మత మార్పిడుల నిరోధక ఆర్డినెన్స్
  • ఉత్త‌రాఖండ్ లోనూ అలాంటి చ‌ట్టమే 
  • వాటికి వ్య‌తిరేకంగా ప‌లువురు పిటిష‌న్లు దాఖ‌లు

ల‌వ్ జిహాద్ వంటి ఘ‌ట‌న‌ల‌ను అరిక‌ట్టేందుకు మ‌త మార్పిడుల విష‌యంలో ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు చ‌ట్టాలు చేసిన విష‌యం తెలిసిందే. పెళ్లిని సాకుగా చూపుతూ జరిగే మత మార్పిడులను అడ్డుకునేందుకు యూపీ స‌ర్కారు చట్ట వ్యతిరేక మత మార్పిడుల నిరోధక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది.

ఉత్త‌రాఖండ్ లోనూ చ‌ట్టాన్ని చేయ‌డంతో వాటిని సవాలు చేస్తూ సిటిజన్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌ స్వచ్ఛంద సంస్థ, న్యాయవాది విశాల్ థాక‌రే తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిని విచారించిన‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వాటి చెల్లుబాటును పరిశీలించేందుకు అంగీక‌రించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు వినకుండా వాటిని నిలుపుదల చేయలేమని పేర్కొంటూ వాటిపై నాలుగు వారాల్లోగా స్పందన తెల‌పాల‌ని యూపీ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News