Donald Trump: షాక్ ఇచ్చిన ట్విట్టర్.. డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా మూసేసిన మైక్రోబ్లాగింగ్ యాప్

Trump Twitter Account Suspended Permanently

  • ఇటీవల ట్వీట్లను పరిశీలించిన అనంతరం నిర్ణయం
  • ట్వీట్లతో హింసను ప్రోత్సహించే ప్రమాదం ఉందన్న ట్విట్టర్
  • ఇంకా నిర్ణయం తీసుకోని ఫేస్‌బుక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మైక్రోబ్లాగింగ్ బ్లాగ్ ట్విట్టర్ కోలుకోలేని షాకిచ్చింది. తన ట్వీట్ల ద్వారా హింసను ప్రోత్సహించే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ ఆయన ఖాతాను శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

జో బైడెన్ గెలుపును నిర్ధారించేందుకు ఇటీవల కేపిటల్ భవనంలో కాంగ్రెస్ సభ్యులు సమావేశయ్యారు. విషయం తెలుకున్న ట్రంప్ మద్దతుదారులు భవనంపై దాడిచేసి నానా హంగామా చేశారు. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో నలుగురు చనిపోయారు.

తీవ్ర హింసకు కారణమైన ఈ ఘటన తర్వాత ట్రంప్ ఖాతాలను 12 గంటలపాటు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు నిలిపివేశాయి. ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి షేర్ చేసిన మూడు వీడియో ట్వీట్లను కూడా ట్విట్టర్ నిలిపివేసింది. నూతన అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే ఈ నెల 20వ తేదీ వరకు ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేస్తున్నట్టు ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. కాగా, ట్రంప్ ఖాతాను శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించగా, ఫేస్‌బుక్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

  • Loading...

More Telugu News