Mercedes Benz: జనవరి 15 నుంచి పెరగనున్న బెంజ్ కార్ల ధరలు!

Mercedes Benz India Announces Price Hike On All Models From January 15

  • యూరోతో పోలిస్తే బలహీనపడిన రూపాయి విలువ
  • రూపాయి బలహీనపడటంతో పెరిగిన దిగుమతుల ఖర్చు
  • అన్ని వేరియంట్లపై 5 శాతం వరకు ధరల పెంపు

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కార్ల ధరలను పెంచబోతోంది. జనవరి 15 నుంచి ధరలను పెంచుతున్నట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈరోజు ప్రకటించింది. పెరుగుదల రేటు 5 శాతం వరకు ఉంటుందని సంస్థ తెలిపింది. గత 6 నుంచి 7 నెలలుగా యూరోతో పోల్చితే ఇండియన్ కరెన్సీ రూపాయి మారకం విలువ తగ్గుతూ వస్తోందని... కార్ల ధరలను పెంచడానికి ఇదే కారణమని తెలిపింది. రూపాయి విలువ బలహీనం కావడంతో దిగుమతుల ఖర్చు పెరుగుతోందని... దీంతో ఓవరాల్ గా కార్ల ధరలపై అది ప్రభావం చూపిందని వెల్లడించింది. విధిలేని పరిస్థితుల్లోనే ధరలను పెంచాల్సి వస్తోందని తెలిపింది.

పెరగనున్న ధరల వివరాలు:
మోడల్పెరగనున్న ధర 
C 20049.50 లక్షలు
C 220d
51.50 లక్షలు
E 200
67.50 లక్షలు
 E 220 d
68.50 లక్షలు
GLC 200
56 లక్షలు
GLC 220 d
61.5 లక్షలు
GLE 450 4M LWB
93 లక్షలు
GLE 300 d 4M LWB
77.50 లక్షలు
GLS 450 4M
1.05 కోట్లు
GLS 400 d 4M
1.05 కోట్లు
AMG GLE 53 Coupe
1.30 కోట్లు
AMG C 63 Coupe
1.40 కోట్లు
AMG GT 4 Door Coupe
2.60 కోట్లు

  • Loading...

More Telugu News