Sensex: నేడు కూడా లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- కరోనా వ్యాక్సిన్ పంపిణీతో బలపడిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్
- 248 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 79 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కోనసాగుతోంది. మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 50 వేల మార్కును అందుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈరోజు కూడా మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి.
దేశంలో అన్ని రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 248 పాయింట్లు లాభపడి 49,517కి చేరుకుంది. నిఫ్టీ 79 పాయింట్లు పెరిగి 14,563 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.95%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.79%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.06%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.05%), ఐటీసీ (1.95%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-3.24%), టైటాన్ కంపెనీ (-2.09%), నెస్లే ఇండియా (-2.04%), సన్ ఫార్మా (-1.69%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.68%).