Sensex: ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 25 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- ఒక పాయింట్ లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన ట్రేడింగ్... ఆ తర్వాత నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుంది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 25 పాయింట్లు నష్టపోయి 49,492కి పడిపోయింది. నిఫ్టీ 1 పాయింట్ లాభపడి 14,565 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (5.74%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.48%), ఐటీసీ (2.40%), ఎన్టీపీసీ (2.14%), భారతి ఎయిర్ టెల్ (1.90%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-3.03%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.66%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.91%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.37%), ఏసియన్ పెయింట్స్ (-1.27%).