vaccine: ఏపీలో రెండో రోజు కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమం
- ఆంధ్రప్రదేశ్ లోని 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
- వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్లు
- తొలి రోజు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతం
ఆంధ్రప్రదేశ్ లోని 332 కేంద్రాల్లో రెండో రోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఏపీలో నిన్న సీఎం జగన్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఏపీలో తొలి దశలో మొత్తం 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఏపీకి మొత్తం 4.96 లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే.
కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా వేస్తున్నారు.
తొలి రోజు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతమైంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. నిన్న మొత్తం 19,108 మందికి వ్యాక్సిన్ వేశారు.