Corona Virus: వ్యాక్సిన్ రావడంతో కరోనా కాలర్ టోన్ లో మార్పులు
- మొన్నటి వరకు కరోనాపై అవగాహన
- ఇకపై వ్యాక్సిన్ పై అవగాహన
- వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని టోన్
- వైరస్ను ఎదుర్కొనే శక్తిని వ్యాక్సిన్ అందిస్తుందని సందేశం
కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ వైరస్ పై అవగాహన కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కాలర్ టోన్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఆ కాలర్ టోన్ లో చెప్పేవారు. అలాగే, మనం పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగితో కాదని సందేశం ఇచ్చేవారు.
అయితే, దేశంలో వ్యాక్సిన్ రావడంతో ఆ కాలర్ టోన్ ను మార్చేశారు. ఇప్పుడు మొదటిసారి ఎవరికి ఫోన్ చేసినా కొత్త కాలర్ టోన్ వినపడుతోంది. దేశంలో రూపొందించిన వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని అందులో పేర్కొంటున్నారు. వైరస్ను ఎదుర్కొనే శక్తిని వ్యాక్సిన్ అందిస్తుందని అందులో చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో కరోనా కాల్ సెంటర్లను సంప్రదించాలని అందులో వివరాలు తెలుపుతున్నారు.