Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 470 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 152 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- నాలుగున్నర శాతం వరకు నష్టపోయిన ఓఎన్జీసీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 470 పాయింట్లు నష్టపోయి 48,564కి పడిపోయింది. నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 14,281 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.37%), టైటాన్ కంపెనీ (1.86%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.15%), ఐటీసీ (0.76%).
టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-4.59%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.71%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-3.50%), బజాజ్ ఫైనాన్స్ (-3.44%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.21%).