TTD: టీటీడీ పింక్ డైమండ్‌పై మ‌రోసారి విచార‌ణ అవ‌స‌రం లేదు: హైకోర్టు

trial does not need says high court

  • వ్యాజ్యంలో జోక్యానికి నిరాకరణ‌
  • ఇప్ప‌టికే సుప్రీంకోర్టు కమిటీలు విచారణ జరిపాయ‌న్న హైకోర్టు
  • నివేదికలు కూడా అందించాయని వ్యాఖ్య

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి  చెందిన పింక్‌ డైమండ్‌ విషయంలో మ‌రోసారి విచారణ అవ‌స‌రం లేద‌ని  ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. దీనిపై విచార‌ణ జ‌రిపించాలంటూ వ‌చ్చిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో జోక్యానికి నిరాకరించింది. దానిపై ఇప్ప‌టికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన‌ రెండు కమిటీలు విచారణ జరిపాయ‌ని, నివేదికలు కూడా అందించాయ‌ని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

కాగా, పింక్‌ డైమండ్‌ విషయంలో విచారణకు ఆదేశించాలని టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ ఈ  ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, మాజీ ఈవోలు ఐవైఆర్‌ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. దీనిపైనే విచార‌ణ జ‌రిపిన హైకోర్టు త‌న నిర్ణయాన్ని వెల్లడించింది. 

  • Loading...

More Telugu News