Gorantla Butchaiah Chowdary: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ సందీప్ అరెస్ట్

TDP MLA Gorantla Butchaiah Chowdary PA Sandeep Arrested
  • శ్రీశైలంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని ఆరోపణ
  • రిమాండ్ విధించిన కోర్టు
టీడీపీ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగత సహాయకుడు చిటికెల సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హుకుంపేట వినాయకుడి విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్‌ను నేడు శ్రీశైలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదే ఘటనలో తొలుత టీడీపీ నేత బాబుఖాన్ చౌదరి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో పరారీలో ఉన్న సందీప్ శ్రీశైలంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అక్కడ అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా, రిమాండ్ విధించింది.
Gorantla Butchaiah Chowdary
Chitikela sandeep
TDP

More Telugu News