Kannababu: అందుకే నిమ్మగడ్డ త్వరగా ఎన్నికలను నిర్వహించాలనుకుంటున్నారు: మంత్రి కన్నబాబు
- స్వార్థ ప్రయోజనాలతో నిమ్మగడ్డ ముందుకు వెళ్తున్నారు
- పదవీ కాలం ముగిసేలోగా ఎన్నికలు జరపాలనుకుంటున్నారు
- ప్రజల ప్రాణాలతో ఆయన చెలగాటం ఆడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ మంత్రి కన్నబాబు స్పందించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పై విమర్శలు గుప్పించారు. స్వార్థ ప్రయోజనాలతో నిమ్మగడ్డ ముందుకు వెళ్తున్నారని అన్నారు.
నిమ్మగడ్డ తన పదవీ కాలం ముగిసేలోగా ఎన్నికలు జరపాలన్న పట్టుదలతో ఉన్నారని కన్నబాబు ఆరోపించారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలో ప్రజల ప్రాణాలతో ఆయన చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఒక్క స్థానంలోనూ గెలవబోదని ఆయన చెప్పారు.