Sensex: మొదట్లో 50 వేల మార్కును దాటి.. చివర్లో నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్
- చరిత్రలో తొలిసారి 50 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్
- లాభాల స్వీకరణతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్న వైనం
- 167 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో ఈరోజు అద్భుతం ఆవిష్కృతమైంది. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 50 వేల మార్కును అధిగమించింది. రానున్న కేంద్ర బడ్జెట్ లో సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలు ఉండబోతున్నాయనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో మార్కెట్లు దూసుకుపోయాయి.
అయితే చివర్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 167 పాయింట్లు కోల్పోయి 49,624కి పడిపోయింది. నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 14,590 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.72%), బజాజ్ ఆటో (2.71%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.09%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.23%), ఏసియన్ పెయింట్స్ (0.62%).
టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-4.00%), భారతి ఎయిర్ టెల్ (-2.56%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.51%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.25%), ఎన్టీపీసీ (-2.19%).