Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు
- 746 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 218 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్సియల్ స్టాకులు బాగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 746 పాయింట్లు నష్టపోయి 48,879కి పడిపోయింది. నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 14,372కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఆటో (10.45%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.88%), టీసీఎస్ (0.87%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.24%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-4.63%), ఏసియన్ పెయింట్స్ (-4.22%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.55%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.39%).